హైకోర్టులో న్యాయమూర్తుల పెంపుపై డా. బండా ప్రకాష్ హర్షం

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 24 నుండి 42 కి పెంచిననందుకు రాజ్యసభ సభ్యుడు, టీ.ఆర్.ఎస్. పార్టీ రాజ్యసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డా. బండా ప్రకాష్ ముదిరాజ్ హర్షం వ్యక్తం చేశారు. గత రెండేండ్లుగా సీఎం కేసీఆర్ తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచమని కేంద్ర ప్రభుత్వాన్ని పలుమార్లు విజ్ఞప్తి చేశారు. హైకోర్టు చీఫ్ జస్టీస్ గా హిమ కోహ్లీ భాద్యతలు స్వీకరించిన తరువాత కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్. వి.రమణ చొరవతో న్యాయమూర్తుల సంఖ్యను 24 నుండి 42 కి పెంచుతున్నట్లు ఆమోదం తెలిపినందుకు కేంద్ర ప్రభుత్వానికి మరియు కృషి చేసిన సీఎం కేసీఆర్, చీఫ్ జస్టీస్ లకు డా. బండా ప్రకాష్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

ads

రాష్ట్ర ప్రభుత్వం మరియు చీఫ్ జస్టీస్ ల విజ్ఞప్తి మేరకు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ మొత్తం 42 మంది న్యాయవాదులలో 32 మంది శాశ్వత న్యాయమూర్తులుగా మరియు 10 మంది ఆడిషనల్ న్యాయమూర్తులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారి చేయడం జరిగిందని బండా ప్రకాష్ తెలిపారు. దీనివల్ల పెండింగ్ లో ఉన్న అనేక సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవుతాయని ఇందుకు వారికి ధన్యవాదాలు అని తెలిపారు.