కరోనాతో బెంగళూరు, కోల్ కతా మ్యాచ్ రద్దు

అహ్మదాబాద్ : ఐపీఎల్ లో మరోసారి కరోనా కలకలంరేపింది. కోల్ కతా నైట్ రైడర్స్ కు చెందిన వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ లకు కరోనా సోకింది. దీంతో సోమవారం రాత్రి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ ను వాయిదా వేశారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు పాజిటివ్ తేలిన విషయం తెలియడంతో ఆర్సీబీ ఈ మ్యాచ్ ఆడటానికి సుముఖంగా లేదని బీసీసీఐ అధికారి ఒకరు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐకి వెల్లడించారు. ఈ మ్యాచ్ ను వాయిదా వేస్తున్నట్లు చెప్పారు.లీగ్ ప్రారంభానికి ముందు కూడా ఢిల్లీ ప్లేయర్ అక్షర్ పటేల్ , ఇదే నైట్ రైడర్స్ కు చెందిన నితీష్ రాణా కూడా కొవిడ్ బారిన పడిన విషయం తెలిసిందే.

ads

ముంబైలోని వాంఖడే స్టేడియంలో కూడా పలువురు గ్రౌండ్ సిబ్బందికి కరోనా సోకింది. అయితే టోర్నీకి ముందే ఆటగాళ్లకు నెగటివ్ గా తేలడంతో లీగ్ సజావుగా సాగుతోంది. ప్రస్తుతం ప్లేయర్స్ అంతా కఠినమైన బయోబబుల్ లో ఉంటున్నారు. అయితే ఈ ఇద్దరు ప్లేయర్స్ తమ గాయాలకు స్కానింగ్ కోసం వెళ్లినప్పుడు కరోనా బారిన పడి ఉంటారని అనుమానిస్తున్నారు.