బార్ కౌన్సిల్ పరీక్ష వాయిదా

న్యూఢిల్లీ: బార్ కౌన్సిల్ పరీక్ష (ఏఐబీఈ) వాయిదా పడింది. ఈ విషయాన్ని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ( బీసీఐ) ఒక అధికార ప్రకటనలో వెల్లడించింది. ఆలిండియా బార్ పరీక్షకు కొత్త షెడ్యూల్ ప్రకటించడంతో పాటు పరీక్షకు దరఖాస్తు దాఖలు తేదీని కూడా పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నిజానికి ఈ పరీక్ష వచ్చే నెల 21న జరుగాల్సి ఉన్నది.

సవరించిన షెడ్యూల్ ప్రకారం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇప్పుడు 2021 ఏప్రిల్ 25న ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ ను నిర్వహిస్తుందని పేర్కొన్నది. మార్చి 21న జరుపతలపెట్టిన పరీక్షను కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా వాయిదా వేశారు. దీంతో పాటు బీసీఐ ప్రవేశపరీక్షకు దరఖాస్తు చేసుకోవలసిన చివరి తేదీని కూడా పొడిగించారు. పరీక్షను హాజరు కావాలనుకునే అభ్యర్థులు ఇప్పుడు 2021 మార్చి 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, ఆన్ లైన్ ఫారం నింపడానికి చివరి తేదీ 2021 మార్చి 31. పరీక్షకు అడ్మిట్ కార్డులు 2021 ఏప్రిల్ 10న జారీ చేయబడుతుంది. అంతకుముందు దరఖాస్తు దాఖలకు చివరి తేదీని ఫిబ్రవరి 26గా ప్రకటించారు.