బీఈ రివాల్యుయేషన్ ఫలితాలు విడుదల

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈ సెమిస్టర్ పరీక్షల రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఈ (సీబీసీఎస్ ), బీఈ ( నాన్ సీబీసీఎస్ ) కోర్సుల అన్ని సెమిస్టర్ల రివాల్యుయేషన్‎తో పాటు ఎనిమిదో సెమిస్టర్ మేకప్ పరీక్షా ఫలితాలను ఉస్మానియా యూనివర్సిటీ వెబ్‎సైట్ www.osmania.ac.in లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.