ఆ ఏరియాలో ఎలుగుబంటి హల్ చల్

జనగామా జిల్లా : జిల్లాలోని జఫర్ గఢ్ మండలం హిమ్మత్ నగర్ లో శుక్రవారం ఓ ఎలుగుబంటి చింతచెట్టు ఎక్కి హల్ చల్ చేసింది. గ్రామంలోని నర్సయ్య ఇంటి సమీపంలోని చింత చెట్టుపై ఎలుగుబంటి ఉండటం చూసి గ్రామస్తులు సర్పంచ్ తాటికాయల అశోక్ కు తెలిపారు. ఆయన ఎస్సై కిషోర్ కు, ఫారెస్ట్ బీట్ అధికారి నాగరాజు, ఫారెస్ట్ రేంజ్ అధికారి కొండల్ రెడ్డికి సమాచారం ఇచ్చారు. వారు వెటర్నరీ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో రెస్క్యూ టీంతో హిమ్మత్ నగర్ కు చేరుకున్నారు. దానిని బంధించేందుకు ప్రయత్నించినా వలకు చిక్కకపోవడంతో మత్తు ఇంజక్షన్ ఇచ్చారు. అనంతరం వరంగల్ జూపార్క్ కు తరలించారు. దీంతో గ్రామస్తులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

ads