ఇంటర్ అర్హతతో బీఈసీఐఎల్ ఉద్యోగాలు

న్యూఢిల్లీ : మినీరత్న కంపెనీ, ప్రభుత్వరంగ సంస్థ అయిన బ్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్) ఖాళీగా ఉన్న మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కల్గినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఎలాంటి రాతపరీక్ష లేకుండా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఎంపికైన వారు భోపాల్ లోని ఎయిమ్స్ లో పనిచేయాల్సి ఉంటుంది. ఈ నియామకాలను పూర్తిగా కాంట్రాక్ట్ ప్రాతిపదికగా చేపట్టనుంది.

ads

పోస్ట్ పేరు : మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ ః
మొత్తం పోస్టులు : 28 ( ఇందులో జనరల్ -13, ఓబీసీ -4, ఎస్సీ-6, ఎస్టీ-2, ఈడబ్ల్యూఎస్ -3 చొప్పున ఖాళీగా ఉన్నాయి)
అర్హత : డిగ్రీలో బీఎస్సీ మెడికల్ రికార్డ్స్ ఉత్తీర్ణత లేదా ఇంటర్ లో సైన్స్ గ్రూప్ చేసి మెడికల్ రికార్డ్స్ లో 6 నెలల డిప్లొమా చేసి ఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
ఎంపిక ప్రక్రియ : ఇంటర్వ్యూ
దరఖాస్తు విధానం : ఆన్లైన్ లో
అప్లికేషన్ ఫీజు : రూ.750, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీహెచ్ అభ్యర్థులకు రూ.450
దరఖాస్తులకు చివరి తేదీ : మే 31
వెబ్ సైట్ : www.becil.com లేదా https://becilregistration.com