జూన్ 23న డబ్ల్యూహెచ్ఓతో భారత్ బయోటెక్ భేటీ

హైదరాబాద్ : కొవాగ్జిన్ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు కోసం భారత్ బయోటెక్ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా అనుమతుల కోసం డబ్ల్యూహెచ్ఓతో ఈనెల 23న ప్రీ- సబ్మిషన్ పై సమావేశం కానున్నది. ఎమర్జెన్సీ వినియోగ జాబితా (ఈయూఎల్) కోసం అవసరమైన 90 శాతం డాక్యుమెంట్లను సమర్పించినట్లు గతంలోనే కంపెనీ తెలిపింది. మిగతా పత్రాలను ఈ నెలలో అందచేయాల్సి ఉంది. కొవాగ్జిన్ కు వ్యాక్సిన్ కు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు కోసం విదేశాంగ శాఖ భారత్ బయోటెక్ తో సమన్వయం చేస్తోంది.

ads

ఇండియన్ మెడికల్ రీసెర్చ్ సహకారం, నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసింది. స్వదేశీ వ్యాక్సిన్ కు డీసీజీఐ అత్యవసర వినియోగం కింద అనుమతి ఇవ్వగా, జనవరిలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన టీకా డ్రైవ్ లో కొవాగ్జీన్ టీకాను వినయోగిస్తున్నారు.