జైలు నుంచి భూమా రిలీజ్

హైదరాబాద్ : టీడీపీ నాయకురాలు, ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఇవాళ సాయంత్రం జైలు నుంచి విడుదలైంది. బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో అరెస్టయి చంచల్ గూడ జైలులో భూమా అఖిల ప్రియ రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. అఖిలప్రియ జైలు నుంచి విడుదలవుతుండటంతో ఆమె బంధువులు, అభిమానులు చంచల్ గూడ జైలు వద్దకు చేరుకున్నారు. ఆమెకు సికింద్రాబాద్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.10వేల పూచీకత్తుతో పాటు ఇద్దరు ష్యూరిటీ సమర్పించాలని ఆదేశించింది. ప్రతీ 15 రోజులకు ఒకసారి బోయినపల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చి సంతకం చేసి వెళ్లాలని కోర్టు ఆమెకు సూచించింది.

ప్రవీణ్ సోదరుల అపహరన కేసులో భూమా అఖిలప్రియ ప్రధాన నిందితురాలిగా ఉండగా ఆమె భర్త భార్గవ్ రామ్ ఏ-3 గా ఉన్నారు. కేసు వెలుగులోకి వచ్చిన నాటి నుంచి భార్గవ్ రామ్ పరారీలో ఉన్నారు. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‎ను సైతం కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే.