“రాధేశ్యామ్” గ్లిమ్స్​ విడుదల

వాలెంటైన్స్ డే సందర్భంగా రెబెల్ స్టార్ ప్రభాస్, యూవి క్రియేషన్స్, రాధా కృష్ణ – “రాధేశ్యామ్” రొమాంటిక్ గ్లిమ్ప్స్ విడుదలహైదరాబాద్​: రెబల్ స్టార్ ప్రభాస్, గాడ్జియస్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ లవ్లీ ఎంటర్టైనర్ రాధే శ్యామ్. పాన్ ఇండియన్ సినిమాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు రాధాకృష్ణ కుమార్. అన్ని భాషలలో కూడా రాధే శ్యామ్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రభాస్, పూజా హెగ్డే ఫస్ట్ లుక్ లకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మోషన్ పోస్టర్ కు మంచి స్పందన వచ్చింది. ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి14 ఉదయం 9.18 నిమిషాలకు రాధే శ్యామ్ రొమాంటిక్ గ్లిమ్ప్స్ విడుదల చేశారు. పూర్తిగా ల‌వ్లీగా, రొమాంటిక్ ఫీల్ తో సాగేలా ఈ గ్లిమ్ప్స్ ని సిద్ధం చేశారు.

‘Sei Un Angelo? Devo Morire per incontrarti?’ అంటూ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఇటాలీయ‌న్ లో ప‌లికిన సంభాష‌ణ‌లు అంద‌ర్నీ ఆక‌ట్టుకున్నాయి. ఆ త‌రువాత గ్లిమ్స్ ఎండ్ లో హీరోయిన్ పూజాహెగ్దే ప్ర‌భాస్ ను నువ్వేమైనా రోమియో అనుకుంటున్నావా అంటే దానికి స‌మాధానంగా ఛా వాడు ప్రేమ‌కోసం చచ్చాడు నేనలా కాదు అని ప్ర‌భాస్ చెప్పిన పంచ్ డైలాగ్ ఈ గ్లిమ్స్ వీడియోని నెక్ట్స్ లెవ‌ల్ కి తీసుకెళ్లాయి. డైలాగ్స్ తో పాటు ద‌ర్శ‌క‌డు రాధాకృష్ణ అందించిన విజువ‌ల్స్, సంగీత ద‌ర్శ‌కులు జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్, మిథూన్ లు ఇచ్చిన నేప‌థ్య సంగీతం వెర‌సి ఈ గ్లిమ్ప్స్ మ‌రింత ఆక‌ట్టుకునేలా విధంగా మార్చాయి. రెబ‌ల్ స్టార్ డాక్టర్​. యూ వీ కృష్ణంరాజు స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్ధ‌లు గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్ భారీ బడ్జెట్ తో రాధే శ్యామ్ సినిమాను అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. వంశీ, ప్ర‌మోద్, ప్ర‌సీదలు ఈ పాన్ ఇండియా సినిమాకు నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు, క‌న్న‌డ‌, త‌మిళ‌, మ‌ళ‌యాలీ వెర్ష‌న్స్ కు సంగీతాన్ని అందిస్తున్నారు. హిందీ వెర్షన్ కు మిథూన్, మనన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. జూలై 30న‌ ఏక‌కాలంలో హిందీ, త‌మిళ‌, తెలుగు, క‌న్న‌డ‌, మ‌ళ‌యాలం భాష‌ల్లో రాధేశ్యామ్ భారీ రేంజ్ లో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.

నటీనటులు:
ప్రభాస్, పూజా హెగ్డే

టెక్నికల్ టీమ్ :
దర్శకుడు : రాధాకృష్ణ కుమార్
నిర్మాతలు : వంశీ, ప్ర‌మోద్, ప్ర‌సీద
బ్యానర్స్ : గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్
సంగీతం : జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్
పీఆర్వో : ఏలూరు శ్రీను