ఎమ్మెల్సీ కవిత పేరుతో ఘరానా మోసం

కామారెడ్డి : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరుతో కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఘరానా మోసం చోటుచేసుకుంది. డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇప్పిస్తామని చెప్పి మహేష్ గౌడ్ , వినోద్ అనే ఇద్దరు వ్యక్తులు మోసాలు ప్రారంభించారు. ఈక్రమంలో మహమ్మద్ అలియాస్ స్వామి అనే వ్యక్తి నుంచి సమారు రూ.6.50 లక్షలు వసూలు చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఒకటి, వేములవాడలో మరొక డబుల్ బెడ్ రూం ఇళ్లు అని చెప్పి వాటికి సంబంధించినవి అంటూ రెండు తాళాలు అప్పగించారు. మోసపోయానని గ్రహించిన మహమ్మద్ కామారెడ్డి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ads