కాంగ్రెస్​కు ఎదురుదెబ్బ

హైదరాబాద్ : కాంగ్రెస్​ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఇందిరా శోభన్ పోశాల కాంగ్రెస్​ పార్టీకి రాజీనామా చేసి బుధవారం లోటస్​పాండ్​లో వైఎస్​ షర్మిలను కలిశారు. షర్మిల కు మద్దుతుగా ఓ మహిళ గా ఆమెను కలిసినట్లు చెప్పారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసిన నైజం తనది అన్నారు. ఇంకా చేయాల్సింది చాలా ఉందని చెప్పారు. కాంగ్రెస్ లో ఉంటే అది సాధ్య పడదని చెప్పారు ఇందిరాశోభన్​.
కాంగ్రెస్​లో తనకు సముచితం స్థానం లేదని ఆమె విమర్శించారు. గ్రూప్ రాజకీయాల వల్ల ఉత్తమ్ తీసుకున్న నిర్ణయాలు వల్ల బయటకు వచ్చానని ప్రకటించారు.

ads

రాజన్న సంక్షేమ పథకాల వల్ల ఆయన పాలనలో స్వర్ణ యుగం నడిచిందని ఆమె ప్రశంసించారు.
తెలంగాణ లక్ష్యాన్ని ప్రస్తుత ప్రభుత్వం నీరు గారుస్తోందన్నారు .మహిళలంతా షర్మిల కు మద్దతుగా నిలుస్తారని చెప్పారు. కాంగ్రెస్ గ్రూప్ రాజకీయాలకు అడ్డాగా మారింది. ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందని ఇందిరా శోభన్ ఆరోపించారు. కేంద్రం అండ లేకుండా ఇక్కడ కేసీఆర్ ఆటలు కొనసాగవన్నారు. రెండు పార్టీలకు ఒప్పందం ఉందని చెప్పారు.

మతం, కులం, సర్జికల్ స్ట్రైక్ ద్వారానే బీజేపీ ప్రజల్లోకి వెళ్తోందన్నారు. ప్రజా సమస్యలను అన్ని పార్టీలు గాలికి వదిలేశాయని మండిపడ్డారు. కాబట్టి మరో పార్టీ అనివార్యం అయిందని ఇందిరా శోభన్​ పేర్కొన్నారు. తెలంగాణ హక్కులపైనే మా ప్రథమ పోరాటం అని షర్మిల చెప్పారని అన్నారు. తన బాట కూడా అదే కావడంతో షర్మిల తో కలవడానికి వచ్చానన్నారు. పనిచేసినప్పుడు పదవి అడగడంలో తప్పులేదన్నారు. అందుకే సీటు ఆశించా నని ఇందిరాశోభన్ పోశాల వెల్లడించారు.​