రియల్ లైఫ్ లో రియల్ హీరో


హైదరాబాద్ : సోనూ సూద్ ఇప్పుడు ఈ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగుతుంది. కరోనా ఫస్ట్ వేవ్,సెకెండ్ వేవ్ లో అసమాన్యమైన సేవలు చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు సోనూ సూద్ సహాయం పొందుతున్నారు. ఆయన కూడా కుల, ప్రాంత, వర్గాలకు అతీతంగా సేవలు చేస్తూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. రీల్ లైఫ్ లో విలన్ గా కనిపించే ఈయన..రియల్ లైఫ్ లో హీరోగా నిలిచాడు. సోనూ భాయ్ సేవలు పోందిన వారు ఆయన సహాయాన్ని గుండెల్లో దాచుకంటే, మరి కొంతమంది గుడినే కట్టేశారంటేనే అర్ధం చేసుకొవచ్చు ఆయనేంటో. ప్రస్తుతం మీడియాలో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన సోనూ సేవలు గురించి చర్చ జరుగుతుంది. అంతేకాకుండా గూగుల్ లో సోనూసుద్ పేరు అత్యధికంగా సెర్చ్ అవుతూ ట్రెండింగ్ లో ఉంటుంది. ఆయన వివరాల్లో కెళ్తే…

ads

సోనూ సూద్ పంజాబ్ లోని 1973, జూలై 30 న మోగ అనే పట్టణంలో జన్మించాడు. తల్లిదండ్రులు శక్తి సాగర్సూద్,సరోజ్ సూద్. సోనుసూద్ నాగపూర్ లో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. తర్వాత మోడలింగ్ లోకి వెళ్లాడు. అప్పుడే సినిమాల్లోకి వెళ్ళాలనే కోరిక బలపడింది. 1996 లో తెలుగు మహిళ సోనాలిని వివాహం చేసుకున్న ఆయనకి ఇద్దరు కుమారులు ఉన్నారు. 1999 లో కుళ్ళళలగర్ అనే తమిళ సినిమా ద్వారా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించాడు. 2000లోశివనాగేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన హ్యాండ్సప్ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు..కానీ సోనూకి బాలీవుడ్ సినిమాలో నటించాలని కోరిక 2002 లో వచ్చిన షాహిద్-ఏ-ఆజం అనే హిందీ సినిమాలో భగత్ సింగ్ పాత్ర పోషించాడు. ఆ తర్వాత మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన యువ లో అభిషేక్ బచ్చన్ తమ్ముడిగా నటించాడు. తరువాత నాగార్జున సూపర్ , మహేష్ బాబు అతడు సినిమాలో నటించడంవల్ల తెలుగులో మంచి గుర్తింపు సంపాదించాడు… ఆ తర్వాత అనుష్క నటించిన అరుంధతి చిత్రంలో విలన్ గా నటించి విమర్శకుల ప్రసంశలు అందుకున్నాడు. అంతేకాకుండా ఆ సినిమాకు ఉత్తమ విలన్ గా నంది పురస్కారం దక్కింది.సోనూసూద్ వృత్తి పరంగా నటుడు. ప్రవృత్తి పరంగా సమాజ సేవకుడు. కరోనా వైరస్ విజ‌ృంభిస్తున్న నేపథ్యంలో సోనూ సూద్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి అభాగ్యులకు ఆపన్నహస్తం అందించాడు. ప్రవాసీ రోజ్గార్ అనే వెబ్సైట్ ద్వారా వలస కార్మికులకు ఉపాధి చూపిస్తున్నారు.కరోనా ఫస్ట్ వేవ్ లో వలస కార్మికులు తమ సొంత ఊళ్లకు వెళ్లడానికి బస్సులు, ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశాడు. అక్కడి తో ఆగకుండా కిర్గిజ్స్తాన్‌లో చిక్కుకున్న 1,500 మంది భారతీయ విద్యార్థుల స్వదేశానికి తీసుకు రావడానికి ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసాడు. తన సేవలు అక్కడితో ఆపేయకుండా ఆంధ్రప్రదేశ్‌లో చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఒక రైతు ట్రాక్టర్‌ కొనిచ్చాడు. త్రాగునీరు ఇబ్బంది పడుతున్న గ్రామలలో బోర్ వేల్స్ . ఆన్ లైన్ క్లాస్ సమయంలో పిల్లలకు సెల్ ఫోన్లు సహాయం చేశాడు. ఇవి మచ్చుకుమాత్రమే. చెప్పేవి..చెప్పలేని సహాయలు ఎన్నో ఎన్నెన్నో…

సెకెండ్ వేవ్ లో ఆక్సిజన్ , రెమిడిసివర్ ఇంజెక్షన్ లు , బెడ్స్ లేక ప్రాణాలు కోల్పోతున్నవారికి తనవంతు బాధ్యతగా సహాయం చేశాడు. ఆ రాష్ట్రం, ఈ రాష్ర్టం అని తేడా లేకుండా అవసరమైన చోట ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్ లు అందజేశాడు. ఇంకా ఆక్సిజన్ ప్లాంట్స్ లు నిర్మించడానికి ముందుకొచ్చాడు. ట్విట్టర్ ద్వారా సామాన్యులే కాదు సెలబ్రెటీలు సహాయం కోరితే గంటల వ్యవదధిలోనే సహాయం చేస్తూ ఆసరాగా నిలుస్తున్నాడు. అంతేకాదు నెల్లూరు జిల్లాలో ఆక్సిజెన్ జనరేటర్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు సోనూసూద్ కి లేఖ రాసారు. కలెక్టర్ లేఖకు స్పందించిన సోనూ సూద్ విలువైన ఆక్సిజన్ జనరేటర్ ను అందిస్తానని హామీ ఇచ్చాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సహాయాలు చేశాడు. ప్రభుత్వాలు , అధికారులు చెయ్యలేని సహాయాన్ని సోనూసుద్ ఆయన ట్రస్ట్ ద్వారా చేస్తున్నారు. సోనూసూద్ సేవలను కొందరు పనికట్టుకని రాజకీయం, కులం అంటకట్టినా ఆయన మాత్రం తన సేవను కొనసాగించడం విశేషం. సోనూ సూద్ సేవలను కొనియాడుతూ కలియుగ దేవుడని ప్రజలు కొనియాడుతున్నారు..