నిందితుడు బిట్టు శ్రీను అరెస్ట్

హైదరాబాద్: న్యాయవాద దంపతులు వామన్ రావు, నాగమణిల హత్య కేసులో నిందితుడు బిట్టు శ్రీనును పోలీసులు అరెస్ట్ చేశారు. బిట్టు శ్రీనును అరెస్ట్ చేసినట్లు డీసీపీ రవీందర్ వెల్లడించారు. హత్య నిందితులకు బిట్టు శ్రీను వాహనం, ఆయుధాలు సమకూర్చినట్లుగా సమాచారం. జంట హత్యల కేసులో పోలీసులు ఫిబ్రవరి 18న ముగ్గురిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కుంట శ్రీనివాస్, అక్కపాక కుమార్, చిరంజీవిలను అరెస్ట్ చేశారు. వీరందరినీ పోలీసులు మంథని కోర్టులో హాజరుపరచనున్నారు.