మంగ్లీ బోనాల పాట వివాదంపై బీజేపీ ఫిర్యాదు

హైదరాబాద్ : ప్రముఖ గాయని సత్యవతి అలియాస్ మంగ్లీపై బీజేపీ నేతల ఫిర్యాదుతో బోనాల పాట వివాదం మరో మలుపు తిరిగింది. తెలంగాణలో బోనాల పండుగ సందర్భంగా మంగ్లీ పాడిన పాటపై కొద్ది రోజులుగా దుమారం కొనసాగుతున్నది. ఈ పాటలో వాడిన పదాలపై మీడియా, సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండగా, అటు హిందూ సంఘాలు, ఇటు బీజేపీ ఎంట్రీతో వివాదం మరింత దుమారం రేపింది. మరోవైపు తన పాటపై నెలకొన్న వివాదంపై సింగర్ మంగ్లీ తొలిసారి స్పందించారు.

ads

హైదరాబాద్ కు చెందిన పలువురు బీజేపీ కార్పొరేటర్ల బృందం మంగళవారం రాచకొండ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. మంగ్లీ పాటను తక్షణమే సామాజిక మాధ్యమాల నుంచి తొలగించాలని బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. మంగ్లీపై కేసు నమోదు చేయాలని సీపీని కోరారు. అయితే ఈ కేసు నమోదుపై సీపీ కార్యాలయం నుంచి ఎలాంటి విషయం అందలేదు.