కుట్రలో భాగంగానే బీజేపీలో ఈటల చేరిక

వరంగల్ అర్బన్ జిల్లా : తనది కమ్యూనిస్టు భావజాలం అని చెప్పుకునే ఈటల రాజేందర్ బీజేపీలో ఎలా చేరారని మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. బీజేపీలో చేరకముందు ఈటలకు పరాభవం ఎదురైందని, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈటల ఎందుకు చేరలేదో చెప్పాలని ప్రశ్నించారు. హన్మకొండ నక్కలగుట్ట హరిత కాకతీయలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కడియం శ్రీహరి మాట్లాడారు. తన ఆస్తులను కాపాడుకోవడానికి, కేసుల నుంచి తప్పించుకోవడానికి ఈటల బీజేపీలో చేరారని ఎద్దేవా చేశారు. నిన్నా, మొన్నటి వరకు నల్ల చట్టాలు, వ్యాక్సిన్ల వ్యవహారంపై బీజేపీని విమర్శించిన ఈటల ఆ పార్టీలోనే చేరడం సిగ్గుచేటని విమర్శించారు.

ads