గుజ్జుల విస్తృత ప్రచారం

వరంగల్​ అర్బన్​ జిల్లా : ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్​, ఖమ్మం, నల్లగొండ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తున్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రెమేందర్ రెడ్డి గురువారం విస్తృత ప్రచారం నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మతో కలిసి వడ్డేపల్లి చెరువు కట్టపై,సేయింట్​ గ్యాబ్రియల్​ స్కూల్లో వాకర్స్​ను కలిశారు. ​అలాగే జిల్లా కోర్టులో న్యాయవాదులను, నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్​లో ఉద్యోగులను కలిసి ప్రచారం నిర్వహించారు.

ఆయన వెంట ప్రచారంలో మాజీ ఎమ్మెల్యేలు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు యెండల లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే ధర్మరావు, బీజేపీ వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీధర్, రాష్ట్ర నాయకులు పులి సర్రోతం రెడ్డి, కార్పొరేటర్ కొరబోయిన సాంబయ్య, బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శులు కొలను సంతోష్ రెడ్డి, దేశినీ సదానందం గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు మందాటి వినోద్, కందగట్ల సత్యనారాయణ, వలపదాసు రాంమనోహర్, కేతి రెడ్డి విజయలక్ష్మి, పుల్యాల రవీందర్ రెడ్డి, వలబోజు శ్రీనివాస్, మమిడాల నరేందర్, అనిశెట్టి రంజిత్, శివాజీ, అర్చన, గుజ్జుల మహేందర్ రెడ్డి, మంజుల, తదితరులు పాల్గొన్నారు.