కొకైన్ తో పట్టుబడ్డ బీజేపీ మహిళా నేత

కోల్ కతా : పశ్చిమ బెంగాల్ లో బీజేపీ యువ నేత పమేలా గోస్వామి కారులో కొకైన్ తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. కోల్ కతాలోని న్యూ అలీపూర్ ప్రాంతంలో ఎన్ ఆర్ అవెన్యూ నుంచి పమేలా గోస్వామితో పాటు ఆమె స్నేహితుడు ప్రవీర్ కుమార్ దేవ్ ను అరెస్ట్ చేశారు. కొకైన్ తో కారులో పట్టుబడ్డ సమయంలో ఆమెతో పాటు ఆమె భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు.

పమేలా కారులో కొకైన్ ను తరలిస్తున్నారనే ముందస్తు సమాచారంతో ఆమె కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. కారును ఆపిన పోలీసులు ఆమె బ్యాగ్ ను సోదా చేయగా బ్యాగ్ లో, కారు సీటు వద్ద నార్కోటిక్స్ పట్టుబడ్డాయని పోలీసులు తెలిపారు.