కంగనాకు కరోనా పాజిటివ్

ముంబై : బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. గత కొన్ని రోజులుగా స్వల్పంగా అస్వస్థత, కళ్లలో మంటగా అనిపించడంతో శుక్రవారం ఆమె కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. శనివారం ఉదయం వెల్లడైన ఆ పరీక్షల ఫలితాల్లో కంగనా రనౌత్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.

ads

కరోనా సోకడంతో నేను సెల్ఫ్ క్వారెంటైన్ లో ఉన్నా. కరోనా వైరస్ నా శరీరంలో పార్టీ చేసుకుంటున్నదనే విషయం నాకు ఇప్పటి దాకా తెలియదు. ఇప్పుడు తెలిసిందిగా ఇక దాన్ని అంతం చేస్తా. మీరు కూడా దేనికీ మీపై అజమాయిషీ చేసే అవకాశం ఇవ్వొద్దు. మీరు కరోనాకు భయపడ్డారంటే అది మిమ్మల్ని మరింత భయపెడుతుంది. కరోనా వైరస్ కూడా ఒక చిన్న ఫ్లూ లాంటిదే. కొంచెం ఇబ్బంది పెట్టినా అదే తగ్గిపోతుంది. హర్ హర్ మహదేవ్ అని కంగనా తన పోస్టులో స్పష్టం చేశారు.