బాలీవుడ్ పై పంజా విసిరిన కరోనా

ముంబై : బాలీవుడ్ లో కరోనా కలకలం రేపుతుంది. సెకండ్ వేవ్ విస్తృతంగా వ్యాప్తి చెందుతుండటంతో చాలా మంది సెలబ్రిటీస్ కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు బప్పి లహరి కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గత కొద్ది రోజులుగా ఆయనతో కాంటాక్ట్ ఉన్న వాళ్లందరూ పరీక్షలు చేయించుకోవాలని బప్పి లహరి మేనేజర్ పేర్కొన్నారు. అతనికి దేశవిదేశాల నుంచి మెసేజెస్ వస్తున్నాయి. ఆయన క్షేమం కోరుకునే వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం అని స్పోక్స్ పర్సన్ స్పష్టం చేశారు.

ads

ఇప్పటికే బాలీవుడ్ నటుడు మనోజ్ కరోనా బారినపడగా, అనంతరం యాక్టర్ ఆశిష్ విద్యార్థి, బాలీవుడ్ యంగ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్, సంజయ్ లీలా భన్సాలీ, ‘గల్లీభాయ్’ ఫేమ్ సిద్ధార్థ్ చతుర్వేది, హీరోయిన్ తారా సుతారియా, ‘మైదాన్’ చిత్ర దర్శకుడు అమిత్ శర్మ, ‘దంగల్ ఫేమ్ ఫాతిమా సనా షేక్ ‘ , యంగ్ హీరో విక్రాంత్ మెస్సీ, యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్, నటుడు పరేష్ రావల్, మాధవన్, అమిర్ ఖాన్, మనోజ్ బాజ్ పాయ్, దర్శకుడు కనుబెల్ ఇలా 15 మందికి పైగా బాలీవుడ్ సెలబ్స్ కరోనా బారిన పడ్డారు.