ఫిబ్రవరి 1 నుంచి బీపీఈడీ క్లాసులు

హైదరాబాద్ : రాష్ట్రంలోని బీపీఈడీ/డీపీఈడీ కాలేజీల్లో వచ్చే నెల 1 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి. ఈ కోర్సులకు సంబంధించిన తొలిదఫా సీట్ల కేటాయింపు ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. దీంతో ఆయా కాలేజీల్లో సీట్లు పొందిన వారు వచ్చే సోమవారం నుంచి తరగతులకు హాజరుకావాలని అధికారులు సూచించారు. రెండో విడత కౌన్సిలింగ్ ఫిబ్రవరి 8 నుంచి జరుగనున్నాయి.

కరోనా మహమ్మవారి పుణ్యమా అని ప్రభుత్వం విధించిన లాక్ డౌన్‎తో రాష్ట్రంలో 10 నెలల తర్వాత విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. కరోనా నేపథ్యంలో 2020,మార్చి నెలలో పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో విద్యాసంస్థల పున:ప్రారంభంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో ఫిబ్రవరి 1నుంచి 9వ తరగతి వరకు, ఆపై తరగతులకు క్లాసులు నిర్వహించనున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ విద్యాసంస్థలు తిరిగి తెరుచుకునేలా చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.