రాజన్నరాజ్యం తెస్తా : షర్మిల

హైదరాబాద్ : తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తానని ఏపీ సీఎం వైఎస్ జగన్​ సోదరి షర్మిల అన్నారు. త్వరలో అన్ని విషయాలను ప్రకటిస్తానన్నారు. మంగళవారం లోటస్​ పాండ్​లో నల్లగొండ జిల్లా నేతలతో షర్మిల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులకు అభివాదం చేశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను అర్ధం చేసుకోవడానికే ఈ సమావేశం నిర్వహించినట్లు షర్మిల తెలిపారు. నల్గొండ జిల్లాతో పాటు ప్రతి జిల్లా నేతలను కలుస్తానన్నారు.

‘వైఎస్ఆర్ లేని లోటు తెలంగాణలో ఉందని షర్మిల చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు సంతోషంగా లేరు. ఇక్కడి ప్రజలకు రాజన్న రాజ్య పాలన అవసరం ఉంది. ఇవ్వాళ నల్గొండ జిల్లా నాయకుల అభిప్రాయం తీసుకున్న. జిల్లా నేతల నుంచి మంచి స్పందన వచ్చిందని వెల్లడించారు షర్మిల. రాబోయే సమావేశాలు జిల్లాల్లోనే ఉంటాయని చెప్పారు. రానున్న నల్గొండ ఉపఎన్నికల్లో పోటీ చేయమని షర్మిల స్పష్టంచేశారు. జగన్మోహన్ రెడ్డి నేను వేరు కాదు. జగన్మోహన్ రెడ్డి ఆయన పని ఆయనది నా పని నాది అన్నారు షర్మిల. రాబోయే రోజుల్లో అన్ని జిల్లా నేతల అభిప్రాయం తీసుకుంటానని షర్మిల పేర్కొన్నారు. పాదయాత్ర పై షర్మిల స్పందించలేదు. పార్టీ పెట్టడం పై క్లారిటీ ఇవ్వలేదు. త్వరలోనే అన్ని విషయాలపై క్లారిటీ ఇస్తా’అని ప్రకటించారు షర్మిల.ఈ ఆత్మీయ సమ్మేళనంలో షర్మిలను కలిసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.