ఘట్‎కేసర్‎లో గ్యాంగ్ రేప్..?

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా ఘట్‎కేసర్‎లో దారుణం చోటుచేసుకుంది. బీ ఫార్మసీ విద్యార్థినిపై ఓ ఆటోగ్యాంగ్ అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. యువతి కళాశాల నుంచి ఇంటికి వెళ్తుండగా బలవంతంగా జోడిమెట్ల దగ్గర పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి, అనంతరం వివస్త్రను చేసి అక్కడి నుంచి గ్యాంగ్ పరారయ్యారని ఆ యవతి పోలీసులకు తెలిపింది. ఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక పోలీసులు బాధితురాలిని చికిత్స నిమిత్తం దగ్గరిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో బాధితురాలి వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేసుకున్నారు.

బాధితురాలు ఇచ్చిన సమాచారంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ గ్యాంగ్ రేప్‎లో ఆటో డ్రైవర్‎తో పాటు మరో ముగ్గురు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మల్కాజ్గిరి ఏసీపీ శ్యాంప్రసాద్ రావు ఆధ్వర్యంలో ప్రత్యేక టీమ్స్ పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తోంది.