మహారాష్ట్రలో దారుణం

మహారాష్ట్ర : షిర్డీ వెళ్లి వస్తున్న ఒక కుటుంబంపై దొంగలు దాడి చేశారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా కుల్క చెర్ల మండలంలోని బండ వెలకిచ్చెర్ల గ్రామానికి చెందిన ప్రధాన ఉపాధ్యాయుడు కే రాములు , తెలంగాణ గ్రామీణ బ్యాంకులో పనిచేస్తున్న ఉద్యోగి రమేష్ వారి కుటుంబం కారులో షిర్డీ దర్శనానికి వెళ్లారు. అక్కడ పర్యటన అనంతరం తిరిగి ఇంటికి బయలుదేరారు. వారు మహారాష్ట్రానికి రావడంతోనే కొందరు దొంగలు వారిని అడ్డుకున్నారు. కత్తులతో నరికి రాళ్లతో దాడిచేశారు. చిన్న పిల్లలు , మహిళలు అని చూడకుండా వారిపై విచక్షణ రహితంగా దాడికి పూనుకున్నారు దుండగలు. తప్పించుకునే క్రమంలో కారు బోల్తా పడింది. అనంతరం వారి వద్ద ఉన్న 8 తులాల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. కర్ణాటక రాష్ట్రంలోని వాసీ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.