పేకాట ఆడుతున్న వ్యాపారవేత్తలు అరెస్ట్


హైదరాబాద్ : పేకాట ఆడుతున్న పలువురు వ్యాపారవేత్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన హైదరాబాద్ అబిడ్స్‎లో గురువారం చోటుచేసుకుంది. స్థానిక సంతోష్ దాబాపై పోలీసులు రైడు చేశారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న 8 మందిని టాస్క్‎ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సంతోష్ దాబా, మయూర్ పాన్‎షాప్ యజమానులతో పాటు పేకాట ఆడుతున్న మరో ఆరుగురు వ్యాపారవేత్తలను అరెస్ట్ చేశారు. సంఘటనా స్థలం నుంచి రూ.73,860 నగదు, పలు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

ads