బడ్జెట్ కు మంత్రివర్గం ఆమోదం

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రగతిభవన్ లో బుధవారం సమావేశమైన మంత్రివర్గం 2021-2022 బడ్జెట్ ను ఆమోదించింది. మార్చి18 గురువారం ఉదయం 11.30 గంటలకు ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. అయితే గత యేడాది బడ్జెట్ కంటే ఈ యేడాది బడ్జెట్ ఆశాజనకంగా ఉండనున్నట్లు సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. శాసనసభలో ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు, శాసనమండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.

ads