మంత్రి ఈటెల, ఎమ్మెల్యే అరూరి ఇంటింటి ప్రచారం

వరంగల్ అర్బన్ జిల్లా : గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో భాగంగా 1వ డివిజన్ పలివెల్పుల, 55వ డివిజన్ భీమారంలో నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ పాల్గొన్నారు. 1వ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గణిపాక కల్పన, 55వ డివిజన్ అభ్యర్థి జక్కుల రజిత కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే అరూరి రమేష్ వరంగల్ నగరంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా నగర అభివృద్ధికి కృషి చేస్తున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని ఎమ్మెల్యే అరూరి రమేష్, మంత్రి ఈటెల రాజెందర్ అన్నారు.

ads

సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వరంగల్ నగర అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని తెలిపారు. డివిజన్ లో ఇప్పటికే పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తున్న టీఆరెఎస్ పార్టీ అభ్యర్థి తూర్పాటి సులోచన గారిని ఎనుమాముల ప్రజలు మరోసారి ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇంచార్జ్ లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.