యూజీసీ నెట్..వాయిదా దిశగా ఆలోచన

న్యూఢిల్లీ : అసిస్టెంట్ ఫ్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్) చేయడానికి అర్హత కోసం నిర్వహించే యూజీసీ నెట్ పరీక్ష వచ్చే నెల 2న ప్రారంభంకానుంది. మే2 నుంచి 17 వరకు ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించనుంది. దీనికి సంబంధించిన అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల చేయనుంది. ఆసక్తి ఉండి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఎన్టీఏ అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అయితే దేశంలో ప్రస్తుతం కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్న నేపథ్యంలో ఈ పరీక్ష నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ads

ఇప్పటికే సీబీఎస్సీ పరీక్షలు, జేఈఈ మెయిన్ వంటి ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో యూజీసీ నెట్ ను కూడా వాయిదా వేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. దీంతో ఎన్టీఏ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. దేశంలో వరుసగా ఐదో రోజు కూడా 2లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 2,73,810 కేసులు రికార్డవగా, రికార్డు స్థాయిలో 1619 మంది మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కేసులు సంఖ్య 1.5 కోట్లు దాటాయి. ఇందులో 1.78 లక్షల మంది బాధితులు కరోనాతో మరణించారు.