గంజాయి స్మగ్లింగ్ ముఠా అరెస్ట్

ప్రకాశం జిల్లా : మార్టూరులో గంజాయి స్మగ్లింగ్ ముఠాను పోలీసులు శుక్రవారం సాయంత్రం అరెస్టు చేశారు. రాజుపాలెం క్రాస్ రోడ్డులో వాహనాల తనిఖీ సమయంలో రెండు కార్లలో గంజాయి దొరికింది. దీంతో ఆ కారులో ఉన్న ఆరుగురు వ్యక్తులను ఇంకొల్లు సీఐ అల్తాఫ్ హుస్సేన్ ఆధ్వర్యంలో మార్టూరు ఎస్సై చౌడయ్య అరెస్టు చేశారు. వారి వద్ద నుండి ఆరు లక్షల రూపాయలు విలువచేసే 180 కేజీల గంజాయిని స్వాధీనపర్చుకున్నారు. అలాగే గంజాయి అక్రమ రవాణాకు ఉపయోగించిన రెండు కార్లను కూడా సీజ్ చేశారు. ముద్దాయిలు విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయి తెచ్చి ఈ ప్రాంతంలో అమ్ముతున్నారని మీడియా సమావేశంలో సీఐ అల్తాఫ్హుస్సేన్ తెలిపారు.

ads