సీఎం త్వరగా కోలుకోవాలని ప్రముఖుల ఆకాంక్ష

హైదరాబాద్ : కరోనా బారినపడిన సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సాందర రాజన్ తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు, సినీ ప్రముఖులు, పలు పార్టీల నాయకులు ఆకాంక్షించారు. “గౌరవనీయులు రాష్ట్ర సీఎం కేసీఆర్ కు కొవిడ్ పాజిటివ్ అని తెలిసి ఆందోళనకు గురవుతున్నా, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా.. కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యం చేకూరాలి” అంటూ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ట్వీట్ చేశారు.

ads

రాష్ట్ర మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్ , ఎర్రబెల్లి దయాకర్ రావు, గుంటకండ్ల జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ , సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర హోంశాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలితదితరులు సీఎం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

” సీఎం కేసీఆర్ కు స్వల్ప లక్షణాలతో కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. వైద్యుల సలహా మేరకు హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. ప్రజల ఆశీర్వాదాలతో, దేవుడి దీవెనలతో త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా” అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్వీట్ చేశారు.

“సీఎం కేసీఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా” అని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు.

“సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలి. కేసీఆర్ సార్..గెట్ వెల్ సూన్ ” అంటూ ప్రిన్స్ మహేష్ బాబు ట్వీట్ చేశారు.

“సీఎం కేసీఆర్ ప్రజలు, భగవందుడి ఆశీస్సులతో త్వరగా కోలుకోవాలి. సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ప్రజాసేవలో నిమగ్నమవ్వాలని ఆకాంక్షిస్తున్నా” అని సినిమా దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్ పేర్కొన్నారు.