విడుదలైన సీటెట్ ఫలితాలు


హైదరాబాద్: గత నెలలో జరిగిన సీటెట్ ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ( సీబీఎస్సీ ) విడుదల చేసింది. పరీక్షరాసిన అభ్యర్థులు అధికారిక వెబ్‎సైట్ ctet.nic.inలో ఫలితాలు చూసుకోవచ్చని తెలిపింది. దేశవ్యాప్తంగా 135 పట్టణాల్లో జనవరి 31న ఈ ఉపాధ్యాయ అర్హత పరీక్షను నిర్వహించారు.

ads

పేపర్-1 కోసం 16,11,423 మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోగా, 12,47,217 మంది పరీక్ష రాశారు. వీరిలో పేపర్-1లో 4,14,798 మంది క్వాలిఫై అయ్యారు. ఇక పేపర్-2 కోసం 14,47,551 మంది దరఖాస్తు చేసుకోగా 11,04,454 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 2,39,501 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. పరీక్ష ఆన్సర్ కీని సీబీఎస్సీ గత వారం విడుదల చేసిన విషయం తెలిసిందే.