“చావు క‌బురు చ‌ల్ల‌గా” తేదీ ఖరారు

ప్రపంచ‌వ్యాప్తంగా మార్చి 19న అల్లు అరవింద్,‌ జీఏ2 పిక్చ‌ర్స్ , బ‌న్నీవాసు యంగ్ హీరో కార్తికేయ “చావు క‌బురు చ‌ల్ల‌గా” విడుద‌లహైదరాబాద్​ : మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో వ‌రుస విజయాలు అందుకుంటూ సక్సెస్ కు మారుపేరుగా నిలిచిన ‌బన్నీ వాసు నిర్మాత‌గా ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో కార్తికేయ‌, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా నూత‌న ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి తెర‌కెక్కిస్తున్న చిత్రం ‘చావు క‌బురు చ‌ల్ల‌గా’. ‌ఇప్పటికే విడుదలైన టైటిల్. హీరో కార్తికేయ ‘బ‌స్తి బాల‌రాజు’ ఫ‌స్ట్ లుక్, ఇంట్రోకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ త‌రువాత విడుద‌లైన క్యారెక్ట‌ర్ వీడియో, లావణ్య త్రిపాఠి ఫస్ట్ లుక్ కి, టీజ‌ర్ గ్లిమ్ప్స్ కి కూడా అనూహ్య స్పంద‌న ల‌భించింది. ముఖ్యంగా కార్తికేయ గెట‌ప్‌, డైలాగ్ డెలివ‌రి మాడ్యూలేష‌న్ చూస్తే మ‌ళ్లీ చూడాల‌నిపించేలా ఉందంటూ కామెంట్స్ వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో మార్చి 19న చావుక‌బురు చ‌ల్ల‌గా చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్నట్లుగా నిర్మాత బ‌న్నీవాసు అధికారికంగా ప్ర‌క‌టించారు.

‘ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగళ్ల‌పాటి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకునే రీతిన ఈ చిత్రాన్ని సిద్ధం చేస్తున్నార‌నే విష‌యం ఇటీవ‌లే విడుద‌లైన బ‌స్తీబాల‌రాజు క్యారెక్ట‌ర్ వీడియో ద్వారా అలానే తాజాగా వ‌చ్చిన టీజ‌ర్ గ్లింప్స్ ద్వారా స్ప‌ష్టం అవుతుంది. జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ లో “100% ల‌వ్”, “భ‌లేభ‌లే మ‌గాడివోయ్‌”, ” గీతగోవిందం”, “ప్ర‌తిరోజు పండ‌గే” చిత్రాలు ఘ‌న‌ విజాయాలు సాధించాయి. ఆ లెగ‌సినీ స‌క్సెస్ ఫుల్ గా చావుక‌బురుచ‌ల్ల‌గా ముందుకు తీసుకువెళుతుంద‌నే న‌మ్మ‌కంతో ఉన్నామ‌ని అన్నారు. ఈ సినిమాను ప్ర‌పంచ‌వ్యాప్తంగా మార్చి 19న భారీ స్థాయిలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం’అని బ‌న్నీ వాసు తెలిపారు. దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా విడుద‌ల అవ్వ‌నున్నాయి.

నటీనటులు :

కార్తీకేయ‌, లావ‌ణ్య త్రిపాఠి, ఆమ‌ని, ముర‌ళి శ‌ర్మ‌, ర‌జిత‌, భ‌ద్రం, మ‌హేష్‌, ప్ర‌భు త‌దితరులు

సాంకేతిక వ‌ర్గం :

స‌మ‌ర్ప‌ణ : అల్లు అర‌వింద్
బ్యాన‌ర్ : జీఏ2 పిక్చ‌ర్స్
నిర్మాత : బ‌న్నీ వాసు
దర్శకుడు : కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి
ఎడిట‌ర్‌ : స‌త్య జీ
ఆర్ట్‌ : జీఎమ్ శేఖ‌ర్‌
మ్యూజిక్ : జేక్స్‌ బిజాయ్
సినిమాటోగ్రాఫ‌ర్ : క‌ర‌మ్ ఛావ్లా
అడిషిన‌ల్ డైలాగ్స్ : శివ కుమార్ బూజుల‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్స్ : రాఘ‌వ క‌రుటూరి, శ‌ర‌త్ చంద్ర నాయిడు
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ : మ‌నిషా ఏ ద‌త్‌
కాస్ట్యూమ్ డిజైన‌ర్ : మౌనా గుమ్మ‌డి