శ్రీశైలం ఆలయ దర్శన సమయాల్లో మార్పు

శ్రీశైలం : రేపటి నుంచి శ్రీశైల ఆలయ దర్శనం వేళల్లో మార్పు చేస్తూ ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు భక్తులు స్వామి,అమ్మవార్లను దర్శించుకునేందుకు అవకాశం కల్పించారు. కరోనా నేపథ్యంలో గతంలో దర్శన సమయాన్న తగ్గించారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే అనుమతించారు.

ads

లాక్ డౌన్ నేపథ్యంలో కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో అధికారులు దర్శన సమయాన్ని అదనంగా మరో రెండు గంటలు పెంచారు. తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలు సడలించడంతో మల్లికార్జునస్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరుగుతున్నది. ఈ మేరకు వసతుల కల్పనకు సైతం పూర్తి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో కేఎస్ రామారావు తెలిపారు. భక్తులకు కేవలం స్వామి అమ్మవార్ల అలంకార దర్శనం మాత్రమే ఉంటుందని ఆయన వెల్లడించారు.