బీఎడ్ కోర్సు ప్రవేశ నిబంధనల్లో మార్పులు

హైదరాబాద్ : బీఎడ్ కోర్సు ప్రవేశ నిబంధనలను తెలంగాణ ప్రభుత్వం సవరిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. బీఎడ్ అడ్మిషన్స్ పొందాలనుకునే విద్యార్థులు అర్హత కోర్సుల్లో 50 శాతం మార్కులు సాధించి ఉండాలని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ బీసీలకు 40 శాతం కనీస మార్కులుగా నిర్దేశించింది. బీఎడ్ ఫిజికల్ సైన్స్ మెథడాలజీలో చేరాలనుకునే వారు డిగ్రీలో ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ ఏదేని ఓ సబ్జెక్ట్ చదివి ఉండాలి. గతంలో ఫిజిక్స్, కెమిస్ట్రీ రెండు చదివి ఉంటేనే అర్హులుగా పరిగణించేవారు. బయాలజీ మెథడాలజీలో చేరాలంటే బోటనీ లేదా జువాలజీ సబ్జెక్టు ఉంటే అర్హులు. గతంలో ఈ రెండు సబ్జెక్టులు చదివిన వారు మాత్రమే అర్హులు.

ads