మహానంది దేవస్థానం వేళల్లో మార్పులు

మ‌హానంది : రేపటి నుండి మహానంది దేవస్థానం దర్శన వేళలను మార్పు చేశామని ఈవో మల్లిఖార్జున ప్రసాద్ తెలిపారు. ఉదయం 5 నుండి 6:30గంట‌ల వరకు ప్రాతఃకాల సర్కారు సేవలు ఉంటాయన్నారు. అనంతరం ఉదయం 6:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు భక్తులు దర్శనాలు, అన్ని ర‌కాల ఆర్జిత సేవ‌ల నిర్వహణ కొనసాగుతుందన్నారు. భ‌క్తులు కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ ఆర్జిత సేవల్లో పాల్గొన‌వ‌చ్చని సూచించారు.

ads