టీంఇండియా టార్గెట్ 420

చెన్నై: తొలి టెస్టులోనే టీం ఇండియా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది ఇంగ్లండ్. నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‎లో 178 పరుగులకు ఆలౌట్ అయిన ఈ టీం 420 పరుగుల లక్ష్యంతో ఇండియన్ టీంకు సవాలు విసిరింది. తొలి ఇన్నింగ్స్‎లో ఇంగ్లండ్ 41 పరుగుల ఆధిక్యం సంపాదించిన విషయం తెలిసిందే. రెండో ఇన్నింగ్స్‎లో ధాటిగా ఆడటానికి ప్రయత్నించి ఇంగ్లండ్ ప్లేయర్స్ వికెట్లు పారేసుకున్నారు.

టీం ఇండియా బౌలర్లలో అశ్విన్ 6 వికెట్లు తీయడం విశేషం. తొలి ఇన్నింగ్స్‎లో డబుల్ సెంచరీ చేసిన కెప్టెన్ రూట్, రెండో ఇన్నింగ్స్‎లోనూ 40 పరుగులతో టాప్ స్కోరర్‎గా నిలిచాడు. నాలుగో రోజు టీం ఇండియా 17 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయాల్సి ఉంది.