ఆదుకున్న అశ్విన్

చెన్నై: చెపాక్ మైదానంలో ఇంగ్లాండ్‎తో సెకండ్ టెస్టులో భారత సీనియర్ ఆ‎ఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (106) సంచలన ప్రదర్భన చేశాడు. మొదట బంతితో ప్రత్యర్థిని తిప్పేసిన అశ్విన్, బ్యాట్ తోనూ రాణించి శతకం సాధించాడు. అశ్విన్ (5/43) విజృంభించంతో తొలి ఇన్నింగ్స్‎లో ఇంగ్లాండ్ 134 పరుగులకే కుప్పకూలింది. భారత్ రెండో ఇన్నింగ్స్‎లోనూ సెంచరీ బాది అరుదైన రికార్డు సాధించాడు. స్వదేశంలో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఇండియన్ బౌలర్ల జాబితాలో అశ్విన్ రెండో స్థానానికి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ లిస్టులో కుంబ్లే ( 350), హర్భజన్ సింగ్ (265), అశ్విన్ (268 ) టాప్ 3 లో ఉన్నారు.

చెపాక్‎లో టెస్ట్ సెంచరీ సాధించిన రెండో తమిళనాడు ఆటగాడు అశ్విన్. ఇదే మైదానంలో 1986/87లో పాకిస్థాన్‎పై మాజీ క్రికెటర్ క్రిస్ శ్రీకాంత్ 123 పరుగులు చేశాడు. టెస్టుల్లో ఎక్కువ సార్లు 5 వికెట్లు, శతకం సాధించింది వీళ్లే
5-ఇయాన్ బోతం
3-అశ్విన్
2-గ్యారీ సోబర్స్/ముస్తాక్ మహమ్మద్/జాక్వెస్ కలీస్ /షకీబ్ అల్ హసన్