29 న ‘చెప్పినా ఎవరూ నమ్మరు’

హైదరాబాద్​ : శ్రీ మోనిక స్రవంతి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆర్యన్ కృష్ణ, సుప్యార్ధే సింగ్ హీరో, హీరోయిన్లు గా ఆర్యన్ కృష్ణ దర్శకత్వంలో ఎం. మురళీ శ్రీనివాసులు నిర్మించిన ‘చెప్పినా ఎవరూ నమ్మరు’చిత్రానికి సెన్సార్ యు/ఏ దక్కించుకుంది. ఈ నెల 29 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు.

‘ఈ నెల 29 న వస్తున్న మా సినిమాతో పాటు నాలుగు, ఐదు సినిమాలు ఉన్నాయి. వారందరినీ దీటుగా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ట్రైలర్ చూసిన ప్రేక్షకుల నుంచి మాకు ఇప్పటికే మంచి ప్రశంశలు వచ్చాయి. ఈ సినిమాకు నేను మొదటి దర్శకుడినైనా డిస్ట్రిబ్యూటర్లు మా సినిమాకు మంచి థియేటర్లు ఇచ్చారు. వారి నుంచి ఇంత మంచి రెస్పాన్స్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ నెల 29 న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదల చేస్తున్న మా చిత్రం అందరికీ తప్పక నచ్చుతుంది’ అన్నారు హీరో,డైరెక్టర్​ ఆర్యన్​కృష్ణ.

‘మా శ్రీ మోనిక స్రవంతి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో వస్తున్న ‘చెప్పినా ఎవరు నమ్మరు’చిత్రానికి సెన్సార్ యు/ఏ దక్కించు కున్నాము. మేము విడుదల చేసిన ట్రైలర్, ఫస్ట్ లుక్ ను చూసిన డిస్ట్రిబ్యూటర్లు అందరూ మా సినిమాకు మంచి థియేటర్లు ఇచ్చారు. వారికి మా కృతజ్ఞతలు. ఈ చిత్రాన్ని న్యాచురల్ లోసెషన్స్ లలో రియలిస్టిక్ గా తీయడం జరిగింది. ఈ నెల 29 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేస్తున్నాము. చూసిన ప్రతి ఒక్కరికీ మా చిత్రం కనెక్ట్ అవుతుంది .మా బ్యానర్ లో మరిన్ని సినిమాలను నిర్మించి ప్రేక్షకుల మన్నన పొందుతాము’ అన్నారు నిర్మాత మురళి శ్రీనివాసులు

తారాగణం:
ఆర్యన్ కృష్ణ, సుప్యార్ధే సింగ్, విక్రమ్ విక్కి , విజయేందర్, రాకేష్ తదితరులు

సాంకేతిక విభాగం:

బ్యానర్: శ్రీ మోనిక స్రవంతి ఆర్ట్ ప్రొడక్షన్స్
నిర్మాత: ఎం. మురళి శ్రీనివాసులు
డైరెక్టర్: ఆర్యన్ కృష్ణ
సినిమాటోగ్రఫీ: బురన్ షేక్, అఖిల్ వల్లూరి
సంగీతం: జగదీశ్ వేముల
ఎడిటర్: అనకల లోకేష్
లిరిక్స్: భాస్కరభట్ల
రీ రికార్డింగ్ : ప్రజావాల్ క్రిష్