అమ్మవారి సేవలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్

* శ్రీ పద్మావతీ అమ్మవారి సేవలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి రమణ
* ఘనంగా స్వాగతం పలికిన ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితిరుచానూరు: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనార్థం విచ్చేసిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ ఎన్.వి రమణ దంపతులకు ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనానంతరం సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ ఎన్.వి రమణ దంపతులు శుక్రవారం తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇతర అధికారులు స్వాగతం పలికారు.

ads

అనంతరం శ్రీ పద్మావతీ అమ్మవారి దర్శనం కోసం ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న జస్టిస్ రమణకు ఆలయ మర్యాదలు, అర్చకుల వేద మంత్రోచ్చారణ నడుమ స్వాగతం లభించింది. జస్టిస్ ఎన్వీ రమణ సతీ సమేతంగా అమ్మవారి సేవలో పాల్గొన్నారు.