సీఎంకు స్వాగతం పలికిన ప్రభుత్వ చీఫ్ విప్

హైదరాబాద్ : నేడు ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ , వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ హాజరయ్యారు. ఈ సమావేశాల సంద‌ర్భంగా శాసన స‌భ‌కు విచ్చేసిన సీఎం కేసీఆర్‎కి ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో గవర్నర్ ప్రసంగం అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో జరిగిన బి.ఏ.సి సమావేశంలో దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొన్నారు.

ads