సంపత్ రాజ్ తో చిట్​ చాట్..​

లౌక్యం’ సక్సెస్ తర్వాత ఆనందప్రసాద్ ఐఫోన్ లు ఇచ్చారు. ‘చెక్’కి అంతకంటే పెద్ద గిఫ్ట్ అడగాలి ! సంపత్ రాజ్.హైదరాబాద్ ​: సంపత్ రాజ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని నటుడు. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఆయనకు ప్రముఖ నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ తో ప్రత్యేక అనుబంధం ఉంది. సంపత్ రాజ్ కెరీర్ ప్రారంభంలో ‘లౌక్యం’లో అతడికి మంచి పాత్ర ఇచ్చి భవ్య క్రియేషన్స్ ప్రోత్సహించింది. ఈ సంస్థలో ఆయన నటించిన తాజా చిత్రం ‘చెక్’. యూత్ స్టార్ నితిన్ కథానాయకుడిగా క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వీ. ఆనంద ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘చెక్’. శుక్రవారం (ఫిబ్రవరి 26న) విడుదల అవుతోంది. ఈ సందర్భంగా సంపత్ రాజ్ తో ఇంటర్వ్యూ ఇచ్చారు.

ads

ప్రశ్న: ‘చెక్’ సినిమా ఎలా ఉండబోతుంది ? సినిమా గురించి చెబుతారా..?

జవాబు : మంచి కథతో రూపొందిన చిత్రమిది. జైలులో ఓ ఘటన జరిగిన తర్వాత ఏమైందనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సినిమాలో ఎక్కువ శాతం హీరో ఒకే కాస్ట్యూమ్ లో కనిపిస్తారు. రియాలిటీకి ఎంత దగ్గరగా ఉండాలో… అంత దగ్గరగా ఉంటుంది సినిమా.‌ చాలా చాలా బావుంటుందని తెలిపారు సంపత్​రాజ్​.

ప్రశ్న : ఇప్పటివరకు మీరు నటించిన సినిమాల్లో ‘చెక్’ భిన్నమైన సినిమా అనుకోవచ్చా ?

జవాబు : అవును తెలుగులో నేను నటించిన సినిమాల్లో భిన్నమైనది ఇదే. సినిమాలో ఎక్కువ లోకేషన్స్ ఉండవు. ఎక్కువ సన్నివేశాలు జైలులో జరుగుతాయి. షూటింగ్ చేసేటప్పుడు నేను అనుకున్నది ఏంటంటే… నిజ జీవితంలో ఓ ఖైదీ జైలులో ఎలా ఉంటాడు? జైలు జీవితం ఎలా ఉంటుంది? అనేది చూశా. పదేళ్లు, ఇరవై ఏళ్లు జైలులో అలా ఉండాలంటే ఎలా ఉంటుంది ? ఈ సినిమా చేయడం ద్వారా ఖైదీ జీవితాన్ని చూశా. అది కాకుండా దర్శకుడు ఆ ప్రపంచంలోకి ప్రేక్షకుల్ని తీసుకువెళతారు. అది హండ్రెడ్ పర్సెంట్ పక్కా. నాకు నమ్మకం ఉంది అన్నారు సంతప్​రాజ్​.

ప్రశ్న : ట్రైలర్ చూస్తే మీరు పోలీస్ గా చేశారని తెలుస్తుంది. నితిన్ లాస్ట్ సినిమా ‘భీష్మ ‘లో కూడా మీరు పోలీస్ గా చేశారు కదా !

జవాబు : ‘భీష్మ’లో నేను పోలీస్ అయినప్పటికీ అందులో నా క్యారెక్టర్ లో ఎక్కువ ఫన్ ఉంటుంది. దానికి, ఈ సినిమాలో నా క్యారెక్టర్ కి అసలు సంబంధం ఉండదు. రెండు డిఫరెంట్ రోల్స్. పోలిక ఏమీ ఉండదు అని చెప్పారు సంపత్​రాజ్​.

ప్రశ్న : ‘చెక్’లో మీ పాత్ర ఎలా ఉండబోతోంది ?

జవాబు : హీరో మీద పగ ఉంటుంది. ప్రతీకారంతో హీరోకి ఉరిశిక్ష పడాల్సిందే, ఉరి అమలు కావాల్సిందే అనే లక్ష్యంతో ఉంటాడు. అతని జీవితంలో మరో అంశం ఉరి పడిందా? లేదా? అన్నది సినిమా. చంద్రశేఖర్ యేలేటి కథ చెప్పినప్పుడు విజువల్ గా ఆ పాత్రలో నన్ను ఊహించుకున్నా. నాకు డిఫరెంట్ రోల్, డిఫరెంట్ పోలీస్ అని అర్థమైంది.

ప్రశ్న : ‘భీష్మ’, ‘చెక్’ కంటే ముందు కూడా మీరు పోలీస్ రోల్స్ చేశారు. పోలీస్ అంటే సంపత్… సంపత్ అంటే పోలీస్ అన్నట్టు !

జవాబు : (నవ్వుతూ) …ఇప్పుడు ‘ఎఫ్3’లో కూడా పోలీస్ గా చేస్తున్నాను. నేను ఏం చేయాలి అనుకుంటున్నానంటే… తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసులకు ఓ లెటర్ రాస్తాను. ‘నాకు పెన్షన్ ఇవ్వండి’ అని. ఎక్కువసార్లు పోలీస్ గా నటిస్తున్నాను కదా! అలాగే, ‘పోలీస్ కమిషనర్, ఐజీ డ్రస్ లు నేనే కుట్టించుకుంటా’ అని. పోలీస్ క్యారెక్టర్ అంటే దానికి తగ్గ డ్రస్ నేనే వేసుకుని షూటింగ్ కి వెళ్తా. పెన్షన్ మాత్రం తప్పకుండా అడుగుతా. (నవ్వులు)

ప్రశ్న : దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి గురించి చెబుతారా ..?

జవాబు : ఆయన గురించి చెక్ చేయడానికి ముందే నేను విన్నాను. నేను రామోజీ ఫిల్మ్ సిటీలో వేరే సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు ఈ సినిమా కథ చెప్పడానికి ఆయన వచ్చారు. పది నిమిషాలు నా క్యారెక్టర్ గురించి వివరించారు. ఈలోపు మేం ఫ్రెండ్స్ అయ్యాం. సినిమాలు కాకుండా చాలా విషయాల గురించి డిస్కస్ చేసుకున్నాం. దర్శకుడిగా ఆయన ప్రతిభ గురించి అందరికీ తెలుసు అని చెప్పారు సంపత్​రాజ్​.

ప్రశ్న : భవ్య క్రియేషన్స్, సంపత్ రాజ్… సక్సెస్ ఫుల్ కాంబినేషన్!

జవాబు : మా కాంబినేషన్ లో ‘లౌక్యం’ సూపర్ డూపర్ హిట్. ఈ సినిమా అంత కంటే పెద్ద హిట్ అవ్వాలి. ఆనంద ప్రసాద్ , అన్నే రవి నా ఫ్యామిలీ. భవ్య క్రియేషన్స్ నా హోమ్ ప్రొడక్షన్ కింద భావిస్తా. ‘లౌక్యం’ హిట్ తర్వాత సక్సెస్ టూర్ లో కోన వెంకట్ ఓ మాట చెప్పారు. సినిమా సక్సెస్ తర్వాత కనీసం ఒక యాపిల్ కూడా ఇవ్వరు. కానీ, ఆనంద ప్రసాద్ యాపిల్ ఐ ఫోన్ ఇచ్చారు. కచ్చితంగా ఈ సినిమా ‘లౌక్యం’ కంటే పెద్ద హిట్ అవుతుంది. ఐ ఫోన్ కంటే పెద్ద గిఫ్ట్ అడగాలి అన్నారు నటుడు సంపత్​రాజ్​.

ప్రశ్న : ‘లౌక్యం’లో నటించిన రకుల్ కూడా ఈ సినిమాలో నటించారు. ఆమెతోనూ మీది సక్సెస్ ఫుల్ కాంబినేషన్!

జవాబు : రకుల్ కి బ్రదర్​ గా నటించాను. తనకు తండ్రిగా నటించాను. తనకు కొలీగ్ చేశా. ఆ అమ్మాయితో కూడా నాది సక్సెస్ ఫుల్ కాంబినేషన్. ఈ సినిమాతో మరోసారి అది ప్రూవ్ అవుతుంది.

ప్రశ్న : ‘ ‘చెక్’ చూశారా?

జవాబు : లేదు. కానీ, కథంతా తెలుసు. క్లైమాక్స్ చాలా బావుంటుంది. నాకు అది బాగా నచ్చింది. ప్రేక్షకుల ఊహలకు భిన్నంగా ఉంటుంది. ఒకటి జరుగుతుందని ఊహిస్తారు. చూస్తే… అది కాదు, మరొకటి జరుగుతుంది. విజువల్స్ షాక్ ఇస్తాయి. దర్శకుడి ఇంటిలిజెన్స్ క్లైమాక్స్ లో ప్రేక్షకులకు తెలుస్తుంది. స్క్రీన్ ప్లే చాలా బావుంటుంది. క్లైమాక్స్ లో టర్న్ అండ్ ట్విస్టులు ఎక్స్ట్రా డినరీ. ప్రేక్షకులు అందరూ సినిమా చూడాలని కోరుకుంటున్నా. ఒక మంచి సినిమా చూసిన అనుభూతి ఇస్తుంది అని సంపత్​ రాజ్​ తెలిపారు.