సీఐ ఆత్మహత్యాయత్నం

భూపాలపల్లి జయశంకర్ జిల్లా : హన్మకొండలో నివాసం ఉంటున్న చిట్యాల సీఐ ఆత్మహత్యకు యత్నించడం కలకలం సృష్టించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల సర్కిల్ సీఐగా పని చేస్తున్న సాయిరమణ హన్మకొండలోని తన నివాసంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన హన్మకొండలోని మ్యాక్స్ కేర్ ఆస్పత్రికి తరలించారు. సీఐ ఇంట్లో పోలీసులు సూసైడ్ నోట్ ను సైతం స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి సీఐ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తున్నది.

అయితే నా చావుకు ఎవరూ కారణం కాదు. కుటుంబ, ఆర్థిక సమస్యలే కారణం’అని చిట్యాల సీఐ సూసైడ్​లో పేర్కొన్నట్లు కేయూ సీఐ జనార్థన్​ రెడ్డి తెలిపారు. తనకు ఇద్దరు పిల్లలు, తన చావుకు ఎవరూ కారణం కాదని సూసైడ్ నోట్లో తెలిపాడు. సాయంత్రం 5.30 నిమిషాలకు సూసైడ్ నోట్ రాసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు సమాచారం. అయితే అసలు ఎందుకు సూసైడ్​ అటెంప్ట్​ చేశారనేదిదానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.