ఎంపీ ర‌ఘురామకు ఈ నెల 28 వరకు రిమాండ్

* ఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజుకు ఈ నెల 28 వరకు రిమాండ్ విధించిన కోర్టు
* అనారోగ్యం కారణంగా రమేష్ హాస్పిటల్‌కు తరలింపు
* కోలుకున్నాక జైలుకు తరలింపుగుంటూరు : వైఎస్సార్సీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు ఈ నెల 28వరకు రిమాండ్ విధిస్తూ సీఐడీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆయన కాలికి ఉన్న గాయాలు తగ్గేవరకు ఆస్పత్రిలో చికిత్స అందించాలని న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. అంతేకాదు ఆయనకున్న వై. కేటగిరీ భద్రతా సిబ్బంది కూడా అప్పటి వరకు ఆయనతో ఉండొచ్చని కోర్టు పేర్కొంది. రఘురామ కోలుకునే వరకు ఆస్పత్రిలోనే ఉండొచ్చని న్యాయస్థానం చెప్పినట్లు న్యాయవాదులు తెలిపారు.

ads