మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులు


హైదరాబాద్​ : ఏపీ మాజీ మంత్రి నారాయణకు ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు అందజేశారు. బుధవారం హైదరాబాద్​లోని నారాయణ నివాసానికి సీఐడీ అధికారులు వెళ్లారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో ఆయన భార్య రమాదేవికి నోటీసులు అందజేశారు. అలాగే నారాయణ ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. హైదారాబాద్, నెల్లూరు, విజయవాడలోని ఇళ్లల్లో సీఐడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. అమరావతి భూముల కొనుగోలు కేసులో నారాయణపై ఇప్పటికే కేసులు నమోదైన విషయం విదితమే.

ads