రేపే 6,7, 8 తరగతులు ప్రారంభం

హైదరాబాద్: రాష్ట్రంలో 6,7, 8 తరగతుల విద్యార్థులకు రేపటి నుంచి బడులు ప్రారంభంకానున్నాయి. పాఠశాలల ప్రారంభానికి ఈ మేరకు విద్యాశాఖ అనుమతి వచ్చింది. రేపటి నుంచి మార్చి 1వ తేదీలోగా తరగతులను ప్రారంభించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. కరోనా నేపథ్యంలో పాఠశాల నిర్వహకులు కొవిడ్ మార్గదర్శకాలు విధిగా పాటించాలని సూచించారు. విద్యార్థులు పాఠశాలకు విధిగా హాజరుకావాలన్న నిబంధనేది లేదని, పిల్లలను పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరని ఆమె పేర్కొన్నారు.