సమ్మక్క, సారలమ్మ ఆలయాలు మూసివేత

ములుగు జిల్లా : ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు తాడ్వాయి మండలం మేడారంలో కొనసాగిన మినీ జాతరలో కరోనా కలకలంరేపింది. సమ్మక్క, సారలమ్మ ఆలయ పూజారులకు ముగ్గురికి కరోనా పాజిటివ్ రావడంతో అప్పటికే అధికారులు భక్తులను అప్రమత్తం చేశారు. అయితే ఆదివాసి, గిరిజన సాంప్రదాయం ప్రకారం నాలుగు రోజుల పాటు కొనసాగిన జాతరలో భక్తులు లక్షలాది మంది భక్తులు హాజరై వనదేవతలను దర్శించుకుని తిరుగుముఖం పట్టారు. అయితే మినీ మేడారం జాతర శనివారం ముగిసినప్పటికీ భక్తుల తాకిడి ఉండటం, మరో వైపు పూజారులకు కరోనా పాజిటివ్ రావడంతో ,వైరస్ మరింత ప్రబలకుండా ఆలయ అధికారులు, పూజారులు మార్చి 1 సోమవారం నుంచి సమ్కక్క, సారలమ్మల గుడి మూసివేస్తున్నట్లు ప్రకటించారు. మార్చి 1 నుంచి 21 వరకు సమ్మక్క, సారాలమ్మ ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించారు. కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పూజారులు వెల్లడించారు.

ads