ప్రగతి భవన్‎లో ఘనంగా రిపబ్లిక్ డే

హైదరాబాద్ : 72వ గణతంత్ర వేడుకలు ప్రగతి భవన్ లో ఘనంగా జరిగాయి. సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. మహనీయుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు. సీఎం రాజకీయ సలహాదారు, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్, రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మతో పాటు పలువురు ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.