హైదరాబాద్ : సీఎం కేసీఆర్ కుటుంబసభ్యులు నేడు, రేపు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో పర్యటించనున్నారు. సీఎం సతీమణి శోభ, కూతురు ఎమ్మెల్సీ కవిత, ఇతర కుటుంబసభ్యులు ఈ రోజు అస్సి ఘాట్ నుంచి దశాశ్వమేధ ఘాట్ వరకు బోటులో ప్రయాణం చేయనున్నారు.
దశాశ్వమేధ ఘాట్‌లో గంగా ఆర్తి, గంగా పూజను తిలకిస్తారు. అనంతరం అస్సి ఘాట్‌కు బోటులో తిరుగు ప్రయాణంకానున్నారు. తర్వాత సంకట్ మోచన్ దేవాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.