భట్టి విక్రమార్కపై ధ్వజమెత్తిన సీఎం

హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్కపై సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఎమ్మెల్యే భట్టికి ఇచ్చిన సమయం మించిపోవడంతో స్పీకర్ పోచారం మరో సభ్యుడికి అవకాశం ఇచ్చారు. దీంతో భట్టి స్పీకర్ పై మండిపడ్డారు. తమకు తగిన సమయం కేటాయించకపోవడం సరికాదని మండిపడ్డాడు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ జోక్యం చేసుకున్నారు. స్పీకర్ ను కూడా నిర్దేశించే పద్ధతి భట్టి విక్రమార్కకు సరికాదని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. సభలో ఇలా మాట్లాడలం భట్టి విక్రమార్కకు పరిపాటిగా మారింది. 26వ తేదీ వరకు బడ్జెట్ సెషన్ ఉంటది. పద్దులపై చర్చ సందర్భంగా కూడా మాట్లాడొచ్చు. ఇప్పటికే చాలా సమయం ఇచ్చారు. సభ్యుల సంఖ్యను బట్టి, సభా నియమాలు పాటిస్తూ ముందుకు పోవాలన్నారు. కేటాయించిన సమయం కంటే నాలుగైదు నిమిషాలు ఇస్తున్నాం. సభకు రావొద్దని మేమేందుకు చెప్తామని సీఎం అన్నారు. సభకు రావొద్దని చెప్పే అవసరం తమకు ఎందుకుంటుంది. ఇలా మాట్లాడటాన్ని అంగీకరించము అని కేసీఆర్ స్పష్టం చేశారు.

ads