సీఎం కేసీఆర్ ఆరోగ్యంగానే ఉన్నారు : వైద్యులు

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని ఆయన వ్యక్తిగత వైద్యుడు ఎంవీరావు తెలిపారు. సీఎంకు కొవిడ్ లక్షణాలు పూర్తిగా పోయాయని, ఆక్సీజన్ లెవల్స్ బాగానే ఉన్నాయని ఆయన వెల్లడించారు. సీఎం కేసీఆర్ కు బుధవారం సాధారణ పరీక్షలు నిర్వహించామని చెప్పారు. సిటీ స్కానింగ్ లోనూ ఎలాంటి సమస్య కనిపించలేదని పేర్కొన్నారు. త్వరలోనే ఆయన విధులకు హాజరయ్యే అవకాశం ఉందని ఎంవీ రావు పేర్కొన్నారు. సోమవారం సీఎం కేసీఆర్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో హోం ఐసోలేషన్ లో ఉన్నారు. నేడు సాయంత్రం సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో ఆయనకు ప్రత్యేక వైద్య బృందం సిటీ స్కానింగ్ తో పాటు మరికొన్ని సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించారు.

ads

సీఎం కేసీఆర్ వ్యక్తిగత వైద్యులు ఎం. వి. రావు ఆధ్వర్యంలో ఈ పరీక్షలను నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఊపిరితిత్తులు సాధారణంగా వున్నాయని, ఎటువంటి ఇన్పెక్షన్ లేదని డాక్టర్లు తెలిపారు. సాధారణంగా నిర్వహించే రక్త పరీక్షల నిమిత్తం కొన్ని రక్త నమూనాలను సేకరించారు. రక్త పరీక్షలకు సంబంధించిన రిపోర్టులు రేపు రానున్నాయి. సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా వుందని, త్వరలో కోలుకుంటారని పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు వెల్లడించారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రి కేటీఆర్, ఎంపి జె. సంతోష్ కుమార్ ఇతర కుటుంబ సభ్యులున్నారు.