24న సీఎం కేసీఆర్​ సమీక్ష

హైదరాబాద్​ : రబీ మార్కెటింగ్ 2021 కార్యాచరణకు ఈ నెల 24 న ఉదయం 11:30 కు ప్రగతి భవన్​లో​ సీఎం కేసీఆర్​ సమీక్ష నిర్వహించనున్నారు. అగ్రికల్చర్, మార్కెటింగ్ ఇష్యూస్ పై సీఎం చర్చిస్తారు. ఈ సమీక్ష సమావేశానికి అన్ని జిల్లాల మార్కెటింగ్​ అధికారులు, మార్కెటింగ్ శాఖ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్లు, రీజినల్ జాయింట్ డైరెక్టర్లు పూర్తి సమాచారంతో హాజరుకావాలని శుక్రవారం సంచాలకులు, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.